IndianMedia.net

Inspiring India, Enlightening Minds

ఇంద్రకీలాద్రిపై శ్రావణ సందడి

తొలి శక్రవారంతో భారీగా భక్తుల రాక

మరోవైపు వర్షాల కోసం వరుణయాగం ప్రారంభం

=
విజయవాడ,ఆగస్ట్‌14(తెలంగాణ చేతనం):ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస సందడి మొదలైంది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ మ్రాం జరుగనుంది. వరలక్ష్మీ మ్రాం నాడు వరలక్ష్మీదేవిగా దుర్మమ్మ దర్శనమివ్వనున్నారు. అలాగే ఈనెల 27, 28, 29 తేదీలలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 4వ తేదీన సామూహిక వరలక్ష్మీ మ్రాాలు జరుగనున్నాయి. శ్రావణమాసంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రత్యేక కుంకుమ పూజలను అర్చకులు నిర్వహించనున్నారు. మరోవైపు, విజయవాడలో వరుణయాగం ఘనంగా ప్రారంభమైంది. వేదపండితులు.. కృష్ణా నదిలోకి దిగి ప్రత్యేక జపాలు చేశారు. ?లోకకల్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రిపై త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు వరుణ యాగాన్ని చేపట్టారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దుర్గాఘాట్‌, పాత యాగశాలలో 3 రోజుల పాటు విశేష హోమాలు, జపాలు, ఘటాభిషేకాలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *