పంటలపై ఎల్‌ నినో ప్రభావం!


ఎల్‌ నినో అంటే ఏమిటో అనుకున్నారు ఈ పేరు వినగానే ప్రజలు. కాని దాని ప్రభావం యామ్గా ప్రపంచంపై కనిపిస్తుండడంతో ఎల్‌ నినో అంటే ఏంటో అర్ధం అవుతుంది. నేడు ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులకు కారణమయ్యే ఎల్‌ నినో ప్రభావం మరింత బలపడుతున్నట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. కొలంబియా యఁనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్లైమేట్‌ అండ్‌ సొసైటీ ఈ మధ్య విడుదల చేసిన అంచనా ప్రకారం.. 2026 చివరి నాటికి, 2027 ప్రారంభంలో ఎల్‌ నినో పరిస్థితులు ‘‘చాలా బలమైన’’ స్థాయిలో కొనసాగవచ్చు. ఈ పరిణామం ఆసియా దేశాలతో పాటు భారత్‌లోనూ వాతావరణ సంబంధిత ప్రమాదాలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎల్‌ నినో బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో నినో 3.4 ఇండెక్స్‌ ఒకటి. మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్‌ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను ఇది సూచిస్తుంది. ఐఆర్‌ఐ ప్రకారం 2026 సెప్టెంబర్‌ మధ్య నాటికి నినో 3.4 సూచిక ం3.0 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఆగస్టు నెలలో ఇది ం2.52 డిగ్రీలుగా ఉండగా, సెప్టెంబర్‌ మధ్య నాటికి మరింత పెరగడం ఎల్‌ నినో తీమ్రా వేగంగా పెరుగుతున్న సంకేతంగా కనిపిస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఐఆర్‌ఐ పరిశీలించిన మొత్తం 22 వాతావరణ నవఁనాలు ఎల్‌ నినో మరింత బలపడే అవకాశాన్ని సూచించాయి. ఇందులో 13 డైనమిక్‌ మోడళ్లు, 9 స్టాటిస్టికల్‌ మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ 2026–27 శీతాకాలంలో ఎల్‌ నినో ‘‘వెరీ స్ర్టాంగ్‌’’ స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. కొన్ని మోడళ్లు నినో 3.4 ఉష్ణోగ్రత అసాధారణత ం3.0 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశాన్ని కూడా సూచిస్తున్నాయి.ఎల్‌ నినో పరిస్థితులు 2027లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని × పరిశీలించిన మొత్తం 22 వాతావరణ నవఁనాలు ఎల్‌ నినో అంచనా వేస్తోంది. 2026 సెప్టెంబర్‌ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌ నినో ఉండే అవకాశం 100 శాతంగా ఉందని మోడల్‌ ఆధారిత అంచనా చెబుతోంది. 2027 మార్చి––మే కాలానికి ఈ అవకాశం 99 శాతంగా, ఏప్రిల్‌––జూన్‌ నాటికి 90 శాతంగా ఉండగా, మే––జూలై 2027లో 61 శాతానికి తగ్గుతుంది. అంటే 2027 మధ్య నాటికి ఎల్‌ నినో బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, దాని ప్రభావం కొంతకాలం కొనసాగవచ్చని అర్థం. ఇదే సమయంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ ( పరిస్థితి కూడా భారత వాతావరణానికి కీలకంగా మారనుంది. పరిశీలించిన మొత్తం 22 వాతావరణ నవఁనాలు ఎల్‌ నినో అంచనా ప్రకారం 2026 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పాజిటివ్‌ × పరిస్థితులు బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 జనవరి నుంచి మార్చి మధ్య తిరిగి తటస్థ పరిస్థితుల వైపు వెళ్లవచ్చని అంచనా. ఎల్‌ నినో, పాజిటివ్‌ ఒకేసారి కనిపించడం సాధారణమే అయినప్పటికీ.. ఈ రెండు వాతావరణ వ్యవస్థలు స్వతంత్రంగా కూడా అభివద్ధి చెందవచ్చని పరిశీలించిన మొత్తం 22 వాతావరణ నవఁనాలు ఎల్‌ నినో స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఏడాది నెలకొన్న ‘ఎల్‌ నినో’ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే రబీ (శీతాకాల) సీజన్‌లో వర్షాధార ప్రాంతాల్లో సాగు సవాలుగా మారే అవకాశముందని, దీనివల్ల దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. న్యూడిల్లీలో జరిగిన రబీ సీజన్‌ సన్నద్ధత జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌ కూడా వర్షాధార ప్రాంతాల్లో తీవ్ర సవాళ్లతో కూడుకుని సాగిందని, అనేక రాష్ర్టాలు విత్తనాలు నాటడం నుంచి పంటను కాపాడుకునే వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని గుర్తుచేశారు. అక్టోబర్‌ నెల నుంచి గోధుమ, ఆవాలు వంటి ప్రధాన రబీ పంటల విత్తే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో నేలలో అధిక తేమ, మరికొన్ని వర్షాభావ ప్రాంతాల్లో సుదీర్ఘ పొడి వాతావరణం పంటలపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాలకు తగినట్లుగా వ్యవసాయ వ్యూహాలను మార్చుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. దేశంలో సాధారణంగా 638 లక్షల హెక్టార్లలో రబీ సాగు జరుగుతుంది. ఇందులో సుమారు 300 లక్షల హెక్టార్లలో గోధుమలు, 140 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు, 87 లక్షల హెక్టార్లలో నూనెగింజలు మరియు 55 లక్షల హెక్టార్లలో ముతక ధాన్యాలు పండిస్తారు. ధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ స్వయంసమద్ధి సాధించినప్పటికీ పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్ల దిగుమూులపై ఇంకా ఆధారపడుతోందని, దీనిని అధిగమించేందుకు ‘పంటల వైవిధ్యీకరణ’ అనివార్యమని ఆయన అన్నారు. ‘ప్రతి చుక్కకూ అధిక పంట’ మరియు నేల ఆరోగ్య కార్డుల వంటి సంక్షేమ పథకాలను కేవలం రాయితీల పంపిణీకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలను సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మౌలిక సదుపాయాలలో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ఆదాయాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ స్వయంసమద్ధి సాధించినప్పటికీ పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్ల దిగుమూులపై ఇంకా ఆధారపడుతోందని, దీనిని అధిగమించేందుకు ‘పంటల వైవిధ్యీకరణ’ అనివార్యమని ఆయన అన్నారు. ‘ప్రతి చుక్కకూ అధిక పంట’ మరియు నేల ఆరోగ్య కార్డుల వంటి సంక్షేమ పథకాలను కేవలం రాయితీల పంపిణీకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలను సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మౌలిక సదుపాయాలలో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ఆదాయాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ప్రభావం తగ్గి సమద్ధిగా వర్షాలు పడాలని అందరూ కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *