కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం!
ట్రైనీ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్ల మృతి!!!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
గార్గ్ ఏవియేషన్‌కు చెందిన టెక్నామ్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది.
గంగా బ్యారేజీ సమీపంలోని నతాపుర్వా గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే విమానం నేలకూలింది.
ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
మృతులను గుజరాత్‌కు చెందిన ఇన్స్ట్రక్టర్ సచిన్ భాటియా, కర్ణాటకకు చెందిన ట్రైనీ పైలట్ అభిషేక్ పూజారిగా గుర్తించారు. సచిన్‌కు 3 వేల గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
VT-NBV నంబర్ గల ఇదే విమానం జూన్‌లో కాన్పూర్ చకేరి ఎయిర్‌పోర్ట్‌లోనూ ప్రమాదానికి గురైందని తెలుస్తోంది.


Leave a Reply