IndianMedia.net

Inspiring India, Enlightening Minds

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై లారీని ఢీకొన్న బస్సుప్రమాదంలో 30మందికి తీవ్ర గాయాలు

ఏలూరు,ఆగస్ట్‌12(తెలంగాణ చేతనం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సవిూపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో
ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్యాబిల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *