
24 గంటలూ రేషన్ బియ్యం తీసుకోవడానికి వీలుగా చత్తీస్ ఘర్ ప్రభుత్వం ఏటీఎం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.
“అన్నపూర్తి” (Grain ATM) అనేది ఛత్తీస్‌గఢ్ PDS / ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏర్పాటు చేయబడింది.
బియ్యం ఎటిఎమ్ (Grain ATM):
ప్రజలు బ్యాంక్ ATM నుండి డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లే, ఈ యంత్రం ద్వారా రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు.
పనిచేసే విధానం:
లబ్ధిదారులు స్క్రీన్‌పై తమ రేషన్ కార్డ్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేసి, వేలిముద్ర (Biometric Fingerprint) వేస్తే నిమిషాల్లో బియ్యం సంచిలోకి వస్తాయి.
ప్రయోజనాలు: * 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం ఉండదు.
సరైన బరువుతో, ఎటువంటి మోసాలు లేకుండా బియ్యం త్వరితగతిన లభిస్తాయి.
ఉద్యోగాలు, కూలీ పనులకు వెళ్లేవారికి సమయం ఆదా అవుతుంది.



Leave a Reply